మునుగోడు ఉప ఎన్నిక ఫై క్లారిటీ ఇచ్చిన సునీల్ బన్సల్

కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్..ఆ తర్వాత బిజెపి లో చేరి ..ప్రస్తుతం ఉప ఎన్నిక బరిలో బిజెపి నుండి నిల్చున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని పార్టీలు పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నిక తేదీ ఫై బిజెపి జాతీయ నేత క్లారిటీ ఇచ్చారు.

డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటే జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతందనే దానిపై కాషాయ శ్రేణులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ క్లారిటీ ఇచ్చారు. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుందని, పార్టీ శ్రేణులందరూ సిద్దంగా ఉండాలని సూచించారు. మునుగోడు ఉపఎన్నికలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని సునీల్ బన్సల్ తెలిపారు. ఇంచార్జ్ లందరూ మునుగోడులో ఉండాలని ఆదేశించారు. మునుగోడు ఉపఎన్నికలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.