ములుగులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఆర్టీసీ బస్సు, కారు ఢీ

ములుగు : ములుగులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద ఆర్టీ బస్సు, కారు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ వైపు నుంచి మేడారం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో గత నెల రోజులుగా ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటోంది.

జాతర మొదలైన గత మూడు రోజుల నుంచి భక్తుల వాహనాలతో రోడ్డు మరింత రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. కానీ, ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/