జగన్ ఫ్యామిలీ జోలికి వస్తే నాలుక కోసి ఉప్పూ కారం పెడతా – మంత్రి రోజా

minister warning to TDP leaders

ముఖ్యమంత్రి జగన్ ను గాని , ఆయన ఫ్యామిలీ జోలికి కానీ వస్తే నాలుక కోసి ఉప్పూ కారం పెడతానని టీడీపీ నేతలను హెచ్చరించారు మంత్రి రోజా. శ‌నివారం ఓ బైక్ ర్యాలీలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత‌ల‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేద‌న్న ఆమె… రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘ‌న‌త తమ పార్టీదే అన్నారు.

టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు పేరును ప్ర‌స్తావించిన రోజా… అయ్య‌న్నపాత్రుడు లాంటి నేత‌లు సైకోల మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అలాంటి నేత‌ల‌ను త్వ‌ర‌లో పిచ్చాసుప‌త్రిలో చేర్చ‌క‌పోతే ప్ర‌జ‌లే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తించాల‌న్నారు. అయ్య‌న్న వ్యాఖ్య‌లు చూస్తే… ఆయ‌న వ‌య‌సుకు గానీ, ఆయ‌న చేప‌ట్టిన ప‌ద‌వుల‌కు గానీ గౌర‌వం ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ఆమె అన్నారు. రాజ‌కీయంగా స‌మ‌స్య‌లు దొర‌క‌లేద‌ని జ‌గ‌న్ కుటుంబంపై విమ‌ర్శ‌లు చేస్తే ఇక‌పై స‌హించ‌బోమ‌ని ఆమె హెచ్చ‌రించారు. జగన్ ను గాని , ఆయన ఫ్యామిలీ జోలికి కానీ వస్తే నాలుక కోసి ఉప్పూ కారం పెడతానని టీడీపీ నేతలను హెచ్చరించారు.