సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ మూవీ టాక్ ..

యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సందీప్..మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకొని వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ పెద్దగా విజయం అందుకోలేకపోయారు. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు మైఖేల్ మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

రంజిత్ జయకోడి తెరకెక్కించిన ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించడగా.. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్ తదితరులు నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ నిర్మించారు.

ఇక ఈ సినిమా ఎలా ఉందనేది అభిమానులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారం సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. స్టోరీ, నేరేషన్, పాత సినిమాను చూసిన ఫీలింగ్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని అంటున్నారు. సందీప్ కిషన్ మాత్రం గత చిత్రాలకు భిన్నంగా నటించారు. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడినట్లు తెరపై కనిపిస్తుందని చెపుతున్నారు.