పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నాడు – మంత్రి కాకాణి

ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. జనసేన vs వైస్సార్సీపీ గా మారింది. వైస్సార్సీపీ నేతలపై దాడి చేసారని జనసేన కార్య కర్తలను అరెస్ట్ చేయడం , పవన్ కళ్యాణ్ పర్యటన ను వైస్సార్సీపీ అడ్డుకోవడం వంటివి ఉద్రికత్త పరిస్థితులకు దారితీసాయి. ఈ క్రమంలో మంగళవారం జనసేన అధినేత పవన్ మీడియా సమావేశం ఏర్పటు చేసి వైస్సార్సీపీ నేతలను హెచ్చరించారు. . ‘నా కొడకల్లారా.. మీకు మాములుగా ఉండదు.. సన్నాసుల్లారా.. వెధవల్లారా..ఏంట్రా మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకు ఎందుకురా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతారా? నేను విడాకులు ఇచ్చి చట్టపరంగా చేసుకున్నాను. వెధవల్లారా కావాలంటే మీరు చేసుకోండి’ అంటూ వైస్సార్సీపీ నేతలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై వైస్సార్సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్‌కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో మాత్రం జీరో అని అన్నారు. మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే.. వికేంద్రీకరణను పవన్‌ వ్యతిరేకిస్తున్నాడని గుర్తుచేశారు. పవన్‌కు రాజకీయ విలువలు, నిబద్ధత లేవు కాబట్టే పోటీ చేసిన రెండు చోట్ల ఓడించారని, పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టే పవన్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు.