ప్రారంభమైన ఏపి శాసనసభ సమావేశం:27-01-2020

అసెంబ్లీలో ‘శాసన మండలి రద్దు’ తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం జగన్‌

అమరావతి: శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సిఎం జగన్‌ ప్రవేశపెట్టారు. మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాలు బాగోలేవని ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా సొంత ప్రయోజనాలపైనే దృష్టిపెట్టి అసెంబ్లీ, శాసనమండలిలో టిడిపి నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాల వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆయన ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/