ఏజెంట్ నుండి ‘వైల్డ్ సాలా..’ మాస్ సాంగ్ రిలీజ్

అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ నుండి ‘వైల్డ్ సాలా..’ అంటూ సాగే ఐటెం సాంగ్ రిలీజ్ అయ్యింది. ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది.

దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. ఏప్రిల్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మేకర్స్ సినిమా తాలూకా అప్డేట్స్ ఇస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ గా సినిమాలోని రామకృష్ణ సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా..మంగళవారం ‘వైల్డ్ సాలా..’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో త‌న‌దైన అంద చందాల‌తో ఊర్వ‌శీ రౌతేలా ఓ ఊపు ఊపేసింది. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో అఖిల్ ఇండియ‌న్ సీక్రెట్ ఏజెంట్‌గా బీస్ట్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే 8 ప్యాక్ బాడీ లుక్‌తో వావ్ అనిపిస్తున్నాడు అఖిల్‌తో పాటు మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఇందులో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

YouTube video