వేసవిలో సహజంగా కన్పించాలంటే..

అందమే ఆనందం..

ఈ కాలం వేడి గాలులు, హానికర రవి కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.. ట్యాన్, దద్దుర్లు, నిర్జీవంగా తయారవటం వంటివన్నీ వీటి పరిణామాలే.. చర్మ పరిరక్షణ కోసం రసాయనాలతో కూడిన క్రీములు వాడకం ఇంకాస్త చేటు చేయొచ్చు. సహజంగా ఎలా కాపాడు కోవాలో చూద్దాం ..

రెండు స్పూన్ల ఓట్స్ కి తగినన్ని పాలు కలిపి పేస్ట్ లా చేయాలి.. దానికి చెంచా చొప్పున టొమాటో , నారింజ గుజ్జు కలిపి పేస్ట్ లా చేయాలి… శుభ్రం చేసుకున్న ముఖానికి , మెడకు పట్టించి ఆరనివ్వాలి.. తర్వాత చేతులను కొద్ది కొద్దిగా తడిచేసుకుంటూ కడిగేయాలి.. టొమాటో , నారింజ ట్యాన్ ని పోగొడితే, పాలు నిగారింపు తెచ్చి పెడతాయి..

నిగనిగ లాడే చర్మానికి:

బాగా పండిన బొప్పాయి ముక్క తీసుకుని మెత్తగా మెదపాలి.. ఆ గుజ్జును ముఖానికి పట్టించి , ఆరనిచ్చి కడిగితే సరి.. దీనిలోని ఎంజైమ్స్ మృతకణాలను తొలగించి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి..

2 లేదా 3 స్పూన్ల ముల్తానీ మట్టిని చిటికెడు సేంద్రీయ పసుపు , తగినన్ని గులాబీ నీళ్లు కలిపి చిక్కని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.. దీన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేయాలి… ముల్తానీ మట్టి చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి, జిడ్డు తొలగించి ముఖాన్ని తేటగా మారుస్తుంది.. పసుపు ట్యాన్ ని తొలగిస్తుంది..

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/category/news/national/