పొటాటో బైట్స్

రుచి : వెరైటీ వంటకాలు

నోట్లో వేసుకుంటే చటుక్కున కరిగి పోయేలా ఉంటాయి ఈ పొటాటో బైట్స్.. తినటం మొదలు పెడితే , ప్లేట్ ఖాళీ అయ్యేదాకా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.. అంత రుచిగా ఉంటాయి.

recipes Potato bites
Potato bites

కావలసిన పదార్ధాలు :

బంగాళా దుంపలు- పావు కిలో , ఉప్పు -రుచికి సరిపడినంత, మిరియాల పొడి- పావు టీ స్పూను., చిల్లీ ఫ్లేర్స్ -సరిపడా, చీజ్-100 గ్రాములు, కోడి గుడ్డు-ఒకటి, బ్రెడ్ పొడి-అరకప్పు, నూనె- వేపుడుకు సరిపడా.

తయారీ విధానం:

ముందుగా బంగాళదుంపలను మెత్తగా ఉడికించు కోవాలి, తర్వాత పొట్టు తీసి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.. కోడి గుడ్డును పగలకొట్టి గిన్నెలో వేసి బాగా గిలకొట్టుకోవాలి. బ్రేడ్ పొడిని కొద్దిగా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి.. ఇపుడు బంగాళా దుంపల పేస్ట్ లో ఉప్పు , చిల్లీ ఫ్లేర్స్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పూరీ పిండి పరిమాణంలో బంగాళాదుంప పేస్ట్ ను తీసుకుని దాంట్లో అరా టీ స్పూను చీజ్ తురుమును ఉంచి, ఉండాలి చుట్టుకోవాలి..

తర్వాత వాటిని కోడి గుడ్డు సొనలో ముంచుకుంటూ , తర్వాత బ్రేడ్ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి.. ఇలా ఉండాలన్నీ రెడీ చేసుకోవాలి.. ఇపుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పొటాటో ఉండలను వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.. ఈ పొటాటో బైట్స్ ను టమాటో సాస్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి..

స్వస్థ (ఆరోగ్య విషయాలు) శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/health/