తెలంగాణ లో రికార్డు స్థాయిలో బీర్ల సేల్స్

ఎండలు దంచికొడుతుండడం తో మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,650 వైన్స్​ షాపులుండగా, వీటి పరిధిలో 19 లిక్కర్​ డిపోలు నడుస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 18 తేదీ వరకు జరిగిన మద్యం అమ్మకాల్లో ఎక్కువ శాతం బీర్లే అమ్ముడయ్యాయి. సమ్మర్​ కావడం, అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడం తో ఎక్కువ బీర్లే తాగుతున్నారు. దీంతో రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడైనట్లు తెలుస్తుంది.

ఈ నెల 1 నుంచి 18 తేదీ వరకు 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి. అంటే సగటున రోజుకు 1,95,847 కాటన్ల బీర్లు తాగేశారు. ఒక్కో కాటన్​కు 12 బీర్ల చొప్పున లెక్కిస్తే సగటున రోజుకు 23,50,164 బీర్లు సేల్స్ అయ్యాయి. ఈ లెక్కన 18 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను కస్టమర్లు ఖాళీ చేశారు. బీర్ల సేల్స్​ ద్వారా సర్కార్​కు వచ్చిన ఆదాయం రూ.582.99 కోట్లు. బీర్ల అమ్మకాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలువగా కరీంనగర్​ జిల్లా రెండో ప్లేస్​లో నిలిచింది. నల్గొండ జిల్లాలో 3,00,364 కాటన్ల బీర్లు అమ్ముడవగా, రూ.48.14 కోట్ల ఆదాయం వచ్చింది.