సుడిగాలి సుధీర్ మూవీ టైటిల్ ‘GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’

సుడిగాలి సుధీర్ నూతన చిత్రానికి ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెర కు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్..వెండితెర ఫై రాణిస్తున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా గాలోడు మూవీ తో మాస్ హిట్ కొట్టిన సుధీర్..తాజాగా మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ లో పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సుధీర్ కు నాల్గో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి ‘GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే టైటిల్ పెట్టారు.

ఈ మూవీతో తమిళ్ బ్యూటీ దివ్య భారతి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఒక మంచి కాన్సెప్ట్‌తో తమ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోందని.. సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మంచి సంగీతం సమకూర్చారని.. మంచి కథతో వస్తోనన తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు.