హైకోర్టులో ‘ఈటల’ కుటుంబం పిటిషన్

క‌లెక్ట‌ర్ ఇచ్చిన నివేదిక పూర్తిగా నిరాధారమని ఫిర్యాదు

etala rajender family petition
Etala family petition in the High Court

Hyderabad: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ కుటుంబం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. అసైన్డ్ భూముల క‌బ్జా విష‌యంలో ఈటలపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన మెద‌క్ క‌లెక్ట‌ర్ ఇచ్చిన నివేదిక పూర్తిగా నిరాధారమని సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్టే వారు నివేదిక ఇచ్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విషయం విదితమే. ఇదిలావుండగా , త‌న‌కు నోటీసు ఇవ్వ‌కుండానే విచార‌ణ జ‌రిపించార‌ని, తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈటల కుటుంబం పిటిష‌న్ లో పేర్కొంది. క‌నీసం వావి వ‌ర‌స‌లు కూడా లేకుండా, త‌న కొడుకును త‌న భార్య‌కు భ‌ర్త‌గా చూపించార‌ని, దీన్ని బ‌ట్టే అది త‌ప్పుడు నివేదిక అని అర్థ‌మ‌వుతోంద‌ని పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/