ఫిబ్రవరి ఆరంభంలోనే దంచికొడుతున్న ఎండలు

తెలంగాణ లో ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు ప్రజలు వామ్మో అంటున్నారు. ఏప్రిల్ లో ఎలాగైతే ఎండలు ఉంటాయో..ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం లోనే ఆ విధంగా ఉండడం తో ఏప్రిల్ , మే నెలలో ఇంకెలా ఉండబోతాయో అని ఖంగారుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం చాల చోట్లా 40 డిగ్రీలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే మరో నాలుగు రోజుల్లో మరింత తీవ్రమైన వేడి వాతావరణ(Weather) పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్‌(Greater Hyderabad) నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల్లో చూసుకుంటే గ్రేటర్ పరిధిలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం జూబ్లిహిల్స్‌లో ఏకంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సరూర్‌నగర్, చందానగర్‌లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్‌లో 37.3 చొప్పున ఉష్ణగ్రతలు నమోదయ్యాయి.