ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు

ఏపీ వాసులకు చల్లటి వార్త. గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త తెలిపింది. రెండు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. కోస్తాలోని పలు జిల్లాల్లో వానలు కురిశాయి. శనివారం 23 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 2 రోజులు కొన్నిచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, క్రుష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానాం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు నైరుతి రుతుపవనాలు పురోగమించడానికి అనువైన వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ చెబుతోంది.