టాలీవుడ్ లో మరో విషాదం…యంగ్ హీరో ఆత్మహత్య
చిత్రసీమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు అనారోగ్య సమస్యలతో , రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. కుందనపు బొమ్మ ఫేమ్ సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన కుందనపు బొమ్మ అనే సినిమాలో సుధీర్ కీలక పాత్ర పోషించి తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఈ సినిమా తో పాటు పలు వెబ్ సిరీస్ లలోను సుధీర్ నటించి అలరించాడు. ఇక సుధీర్ కెరియర్ కు డోకా లేదని అంత అనుకుంటున్నా సమయంలో అతడు వైజాగ్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అవకాశాలు రాక జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడా.. పర్సనల్ రీజన్స్ వల్లన అన్నది తేలాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆయన సన్నిహితులు అంటున్నారు. సుధీర్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు నటుడు సుధాకర్. అతడు లేడన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నానని ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టాడు. సుధీర్ మరణంపై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.