ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం..

ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం

Income Tax Budget 2023: No Income Tax Till Rs 7 Lakh Under New Tax Regime

న్యూఢిల్లీః ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం.. కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ. 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ఆదాయపు పన్ను ఉంటుంది.

ప్రత్యక్ష పన్నుపై..

పన్ను పోర్టల్‌లో రోజుకు 72 లక్షల దరఖాస్తులు వస్తున్నాయని.. రీఫండ్ ప్రక్రియను 16 రోజుల వరకు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో మరింత మెరుగుపడే దిశగా ముందుకు సాగుతున్నాం.

ప్రత్యక్ష పన్ను..

పన్ను రిటర్నుల ప్రాసెసింగ్‌ను 90 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించామని.. ఒక్కరోజులోనే 72 లక్షల పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారం మెరుగుపడింది. సాధారణ IT రిటర్న్ ఫారమ్‌లు వస్తాయి. ఇది రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది.

సీనియర్‌ సిటిజన్లకు గుడ్ న్యూస్

సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.

ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం

2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసింది. ఉద‌యం 11 గంట‌ల‌కు ఆమె బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభించగా.. 1 గంట 26 నిమిషాల పాటు కొన‌సాగింది. సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇది ఐదోసారి. ఇది మూడో పేప‌ర్ లెస్ బ‌డ్జెట్.