భారీ ధరకు శాకుంతలం ఓటిటి రైట్స్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17 న పాన్ ఇండియా గా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర తాలూకా ట్రైలర్ , సాంగ్ , ప్రచార చిత్రాలు ఇలా అన్ని కూడా ఆసక్తి రేపుతుండడం తో..ఈ చిత్ర ఓటిటి రైట్స్ ను భారీ ధరకు అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా విడుదల 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి నిర్మించారు. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. మహా భారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథకి ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి ప్రేమ కథనే దర్శకుడు గుణశేఖర్ అపురూప దృశ్యకావ్యంగా చూపించబోతున్నారు. సమంత లాంటి నటి శకుంతలగా నటిస్తుండడంతో ఆ పాత్ర ఎంతలా హైలైట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సమంత నటన, లుక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. మరి రెండో సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.