సుదర్శనయాగంలో పాల్గొన్న కెసిఆర్‌, చినజీయర్‌ స్వామి

cm-kcr-offers-prayers-at-sudarshana-yagam-in-markuk

సిద్దిపేట: మర్కూక్‌ పంపు హౌజ్‌ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పూర్ణాహుతిలో సిఎం కెసిఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నానారాయణ చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దంపతులు, చినజీయర్‌ స్వామికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మరికాసేపట్లో మర్కూక్ పంపుహౌజ్‌నుసిఎం కెసిఆర్ ‌ ప్రారంభిస్తారు. తర్వాత కొండపోచమ్మసాగర్‌ కట్ట వద్ద డెలివరీ సిస్టర్న్‌ వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, హరీష్‌రావు, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/