మార్కూక్ పంపు హోజ్‌ను ప్రారంభించిన కెసిఆర్ చినజీయర్ స్వామి
కొండపోచమ్మ జలాశం ప్రారంభోత్సవం

సిద్దిపేట: సిఎం కెసిఆర్ చినజీయర్ స్వామితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంపు హౌజ్‌ను ప్రారంభించారు. గోదావరి జలాలకు సిఎం కెసిఆర్ చినజీయర్ స్వామి హారతినిచ్చారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండు మోటార్లను స్విచ్చాన్ చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. కాసేపట్లో గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/