జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు – బ్రాహ్మణి ట్వీట్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ గత 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకేష్ భార్య బ్రాహ్మణి ట్వీట్ చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయవిదారమని ఆవేదన చెందారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.

చంద్రబాబు క్షేమం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని తెలిపారు. చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని నారా బ్రహ్మణి ట్వీట్ చేశారు.