ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు

ఆస్ట్రేలియా : కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రెండు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్ రూపాంతరం చెంది ఒమిక్రాన్‌ రూపంలో ప్రపంచంపై దండెత్తింది. ఈ నేపధ్యంలోనే యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో కూడా ఒమిక్రాన్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. తాజాగా మంగళవారం ఆస్ట్రేలియాలో కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది.

అక్కడి ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలపై రోగుల తాకిడి ఎక్కువైంది. ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో కొత్తగా 23,131 కేసులు నమోదయ్యాయి. జనవరి 1న 22,577 కేసులు నమోదు అయ్యాయి. ఆసుపత్రుల్లో 1,344 మంది చేరారు. అంతకుముందు రోజు 140 మంది, గత ఏడాది సెప్టెంబరు చివరిలో నమోదైన కేసుల కంటే 78 మంది ఎక్కువగా చేరినట్లు తెలుస్తోంది. 83,376 కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 23,131 కొత్త కేసులను వైద్య అధికారులు గుర్తించారు. ప్రస్తుతం న్యూసౌత్ వేల్స్ లో పాజిటివిటీ రేటు 28 శాతం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/