బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో పాటు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.

నిన్న(జనవరి 2) రాత్రి కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/