విద్యార్థుల మోత బరువు తగ్గేనా!

లైఫ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌, మోరల్‌ ఎడ్యుకేషన్‌ ఉండాలి

School children
School children


ఇటీవల కేంద్రప్రభుత్వం నిపుణుల సిఫార్సులతో స్కూలు బ్యాగ్‌ పాలసీ-2020 విడుదల చేసిది. దీని ద్వారా తరగతుల వారీగా స్కూలు బ్యాగ్‌ బరువ్ఞను ప్రకటించబడింది. దీని ప్రకారం విద్యార్థి శరీర బరువ్ఞలో బ్యాగ్‌ పది శాతానికి మించకూడదని, స్కూళ్లలోనే మధ్యాహ్నభోజనం, మంచినీరు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని, స్కూళ్లలోనే హోమ్‌వర్క్‌ చేసుకునే విధంగా సమయం సర్దుబాటు చేయాలని తెలిపింది. తరగతులవారీగా ఉండవలసిన పాఠ్యపుస్తకాల సంఖ్య నిర్ణయించ బడ్డాయి. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం బ్యాగు బరువ్ఞ తగ్గాలని ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాఠశాలల్లో విద్యార్థులపై స్కూలు బ్యాగు బరువ్ఞ ఇక తగ్గడం లేదు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో ఐఐటి మెటీరియల్స్‌ స్టేట్‌ బోర్డ్‌ బుక్స్‌, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌, సొంత మెటీరియల్స్‌ ఇలా రకరకాల పేర్లతో యాభై నుంచి వందవరకు పుస్తకాలు విద్యార్థుల చేత కొనుగోలు చేయి స్తున్నారు. వాటికోసం దాదాపు పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వం కేవలం రాష్ట్ర, కేంద్ర బోర్డు పుస్తకాలు మాత్రమే విద్యార్థులు చదివేలా చేయలేకపోతున్నది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు పుస్తకాల సంఖ్యను పెంచి విద్యార్థులపై శారీరకభారంతోపాటు, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. బ్యాగు బరువుతో విద్యార్థులు శారీరక సమస్యలతోపాటు మానసిక ఒత్తిడికి గురువు తున్నారు.

కానీ ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టు తీర్పు మేరకు కేంద్ర విద్యాశాఖ, ఎన్‌సిఇఆర్టీ, కెవిఎస్‌, ఎన్‌విఎస్‌, సిబిఎస్‌ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు స్కూలు బ్యాగ్‌ పాలసీ2020ని కేంద్ర ప్రభుత్వం వెలువరించింది. దీన్నిఅన్ని రాష్ట్రాలు అమలు చేయా లని పేర్కొన్నది. దీనిప్రకారం విద్యార్థికేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగేపద్ధతి ద్వారాపిల్లల్లో ఒత్తిడి,స్కూలుబ్యాగ్‌బరువు తగ్గాలి

.ప్రభుత్వ స్కూళ్లలో ఈ స్కూల్‌బ్యాగు బరువ్ఞ తగ్గే అవ కాశంఉంది. కానీ ప్రైవేట్‌,కార్పొరేట్‌ విద్యాసం స్థలు ఎంతవరకు అమలు చేస్తాయనే సందేహాలు వ్యక్తమవ్ఞతున్నాయి. అనేక సర్వే ల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనంకన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్‌ బరువ్ఞ పెరగడానికి కారణమని చెప్పవచ్చు.స్కూలు బ్యాగ్‌ బరువును తగ్గించడానికి అనేకరాష్ట్రాలు సెమిస్టర్‌పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నాయి. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు.

ఈ విద్యాసంవత్సరంఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థుల కు సెమిస్టర్‌ పుస్తకాలు, నోటు పుస్తకాలు అవసరం లేకుండా టెక్స్ట్‌బుక్స్‌,వర్క్‌బుక్స్‌ తయారుచేసి విద్యార్థులకు అందుబాటు లోకి తెచ్చింది.ఇదేవిధంగా రాష్ట్రం లోని అన్ని ప్రైవేట్‌,కార్పొరేట్‌ విద్యాసంస్థలు కూడా అవలంబించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్‌ బరువ్ఞ కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు.బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. పిల్లల శరీర బరువును అనుసరించి స్కూల్‌ బ్యాగ్‌ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.

2009లోఅమెరికన్‌ ఆక్యుపేష నల్‌ థెరపీ అసోసియేషన్‌, అమెరికన్‌ ఫిజియోథెరపీ అసోసి యేషన్‌లు విద్యార్థుల శరీరబరువ్ఞలో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్‌ ఉండాలని సూచించాయి. ఒకటి నుంచి ఐదవ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా రెండు నుంచి మూడుకిలోల బరువ్ఞ మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు ఐదుకిలోలకు మించిన బరువ్ఞలో ఉంటున్నాయి. ఆరవ తరగతి విద్యార్థులకు ఆరుకిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలో బరువ్ఞ నిర్ణయించిన దానికన్నా రెండు లేదా మూడురెట్లు అధికంగా ఉంటున్నది.దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు.

మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యేస్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువ్ఞ తగ్గుతున్నది. చాలా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈసదుపాయాలు ఉండటం లేదు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విధా నం స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది.బ్యాగ్‌ను రెండువైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి. స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలి.నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ సూచనల ప్రకారం లైఫ్‌స్కిల్స్‌, కంప్యూటర్‌, మోరల్‌ ఎడ్యుకేషన్‌, జనరల్‌ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాటు చేయాలి. స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి.

  • ఆత్మకూరు భారతి

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/