WHO ఫౌండేషన్‌ సీఈవోగా భారత సంతతి వ్యక్తి

indian-origin-health-expert-anil-soni-appointed-first-chief-of-the-who-foundation

జెనీవా: భారత సంతతికి చెందిన అనిల్‌ సోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఫౌండేషన్‌ సీఈవోగా నియామకమయ్యారు. వచ్చే జనవరి 1 న డబ్ల్యూహెచ్‌ఓ ఫౌండేషన్ ప్రారంభ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సోని తన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకు ముందు గ్లోబర్‌ హెల్త్‌ కేటర్‌ కంపెనీ వట్రియాస్‌లో గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి హెడ్‌గా కొనసాగారు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో వైద్యారోగ్య సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు లాభాపేక్ష లేని రంగాల్లో 20 ఏళ్ల పాటు సేవలందించారు. ఈ సందర్భంగా అనిల్‌ సోనికి డబ్ల్యూహెచ్‌ఓ ఛీప్‌ టెడ్రోస్‌, డబ్ల్యూహెచ్‌ఓ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ఫ్రొఫెసర్‌ థామస్‌ జెల్ట్నర్‌ అభినందించారు.

కాగా, 2023లోగా బిలియన్‌ డాలర్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుని ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఫౌండేషన్‌ పేర్కొంది. ఆ ఫౌండేషన్‌ను ఈ ఏడాది మేలో జెనీవాలో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సమాజంతో కలిసి అత్యంత ఒత్తిడితో కూడిన ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ప్రారంభించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/