హక్కులను హరిస్తున్న వ్యవసాయ చట్టాలు

ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది

Agriculture
Agriculture


కేంద్రప్రభుత్వం రైతులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికే నిర్ణయించుకున్నట్లు కనబడుతున్నది. రైతులు కోరుకునేది స్వేచ్ఛ కాదు. రక్షణ కావాలి. ప్రభుత్వ రక్షణ లేకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ వ్యవసాయరంగం కొనసాగడం లేదు.

అందువల్ల ప్రభుత్వ రక్షణాలు తొలగించడమంటే కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పించి వ్యవసాయరంగాన్ని వారికి కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా చట్టాలను ఉపసంహరించుకోవడం అవసరం.

కేం ద్రప్రభుత్వం ఫెడరల్‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాలను తమ జేబు సంస్థలుగా మార్చుకోవడానికి ప్రయ త్నం చేస్తున్నాయి. ఫెడరలిజం, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం అను పదాలకు అర్థాలను మార్చి అందు కనుగుణంగా గత చట్టాలను సవరణ చేయడం లేదా కొత్త చట్టాలు రూపొందించి, పార్లమెంట్‌లో తనకున్న బలాన్ని వినియోగించుకొని కేంద్రం అమలు జరిపించు కుంటున్నది. గతంలో ఏ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాజేయ డానికి సాహసించలేదు. దీనిని రానున్న కాలంలో భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనకు మార్చడానికి పునాదులు వేస్తున్నారు.

నిత్యావసర వస్తువుల చట్టసవరణ

బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆలుగడ్డ, ఉల్లి, విత్తనాలు తదితర ఉత్పత్తులన్నీ రాష్ట్రాలోల నిత్యావసర సరుకుల చట్టంలో ఉన్నాయి. వీటిని నిత్యావసర వస్తువ్ఞల చట్టం నుండి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం 19, సెప్టెంబర్‌ 2020న లోక్‌సభలో చట్టం చేసింది. ఈ చట్ట సవరణతో ప్రభుత్వానికి ధరల నిర్ణయంపై కానీ, అక్రమంగా నిల్వ చేసుకోవడంపై కానీ ఎలాంటి నియంత్రణ ఉండదు. సరుకులు కొనుగోలు చేసి మార్కెట్‌లలోకి రానివ్వకుండా దాచిపెట్టుకొని అధిక రేట్లకు అమ్మి, రైతుల్ని, వినియోగదారులను దోచుకోవడానికి ఈ వసరణ లైసెన్సు ఇచ్చింది. 12 మాసాలలో హార్టికల్చర్‌ పంటలకు వంద శాతం ధరలు పెరిగినప్పుడు,50 శాతం నాన్‌ పెర్షిబుల్‌ పంటలకు ధరలు పెరిగినప్పుడు, యుద్ధాల వలన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు జోక్యం చేసుకుంటామని కేంద్రం చట్టంలో చెప్పింది. చట్టం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఆ దామాషాలో ధరలు పెరిగాయి. ఈ చట్టం వల్ల కార్పొరేట్‌ సంస్థలు బ్లాక్‌ మార్కెట్‌ చేయడానికి, అక్రమంగా నిల్వ పెట్టు కోటానికి అధిక ధరలకు అమ్ముకోటానికి అవకాశాలు కల్పించారు. నేడు బడా సంస్థలు వ్యవసాయోత్పత్తుల కొనుగోలులోకి తమ పెట్టుబడులు తెస్తున్నారు. వ్యవసాయరంగంలోకి 100 శాతం ఎఫ్‌డిఐని కేంద్రప్రభుత్వం అనుమతించింది. చిన్న వ్యాపారులు, వ్యవసాయోత్పత్తిదారులు, గిట్టుబాటుకాక పూర్తిగా దెబ్బతింటారు.

ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్

ఈ చట్టం 20 సెప్టెంబర్‌న లోక్‌సభ ఆమోదం పొందింది. 25 సెక్షన్‌లతో అగ్రిమెంట్‌ కాలపరిమితి ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రమాణాలు, ధరలు, అమ్మకం తదితర అంశాలు రైతుతో కార్పొరేట్‌ కంపెనీ చేసుకునే అగ్రిమెంట్‌లో ఉంటాయి. ఈ చట్టం ప్రకారం భూమిపై హక్కులు మారవ్ఞ. బీమా, రుణం కూడా అగ్రిమెంట్‌లో ఉంటుంది. అగ్రిమెంట్‌ రద్దు చేసుకోవడానికి మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది. రైతుకు, కొనుగోలు సంస్థకు తగాద వస్తే మధ్యవర్తిగా కన్సీలేషన్‌ బోర్డు, డివిజన్‌, కలెక్టర్‌ వరకు అప్పీల్‌ చేసుకోవచ్చు. కేంద్రం అధికారాలు చట్టాన్ని మార్చడానికి అవకాశం ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టా నికి రూల్స్‌ తయారు చేయాలి. రైతుల ఆదాయ భరోసా ఇచ్చే దిగా పిలుస్తూ, రైతులను మభ్యపెడుతూ కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో ఈ చట్టం కింద 6,500 మార్కెట్లు గుర్తించారు. వీటికి సబ్‌ యూనిట్లు 28వేల మార్కెట్లు ఉన్నాయి.

ఇంతవరకు మార్కెట్‌ బయట కొనుగోళ్లకు అవకాశం లేదు. అలాంటి వాళ్లపై అపరాధ రుసుం విధించి రైతులకు రక్షణ కల్పించారు. కానీ మార్కెట్ల ఫీజు రద్దు చేయడంతో మార్కెట్‌ ఉద్యోగులకు ఉపాధి పోతుంది. అంతేకాక రైతుకు మార్కెట్‌ రక్షణ ఉండదు.నాణ్యతప్రమాణాల పేరుతో నిర్ణయించిన ధరలను తగ్గించి కొనుగోలు సంస్థలు రైతును దివాళా తీయిస్తాయి.

రుణాల పేరుతో అప్పులు ఇచ్చి భూములను కాజేస్తారు. కనీస మద్దతు ధరల విధానం రద్దు అవ్ఞతుంది. రైతుకు ప్రభుత్వం ధరను గ్యారంటీ చేయాల్సిన బాధ్యత నుండి తప్పుకుంటుంది. రైతు కాంట్రాక్టరు చేతుల్లోకి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ప్రభుత్వం మద్దతు ధరలు కొనసాగిస్తానని చెప్పటినప్పటికీ గత అనుభవాన్ని బట్టి శాంత కుమార్‌ కమిషన్‌ సూచనల మేరకు మిల్లర్ల నుండి బయ్యం సేకరణను రద్దు చేసిన విధంగానే ఈ మద్దతు ధరల సౌకర్యాన్ని కూడా రద్దు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌ ఉద్యోగుల వేతనాలు పోగా రాష్ట్రంలో రూ.340 కోట్ల ఆదాయం మార్కెట్‌లకు వస్తున్న ది.ఈ ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. రైతుకు రక్షణ ఉండదు.

ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ యాక్ట్‌

ఈ చట్టం కూడా సెప్టెంబర్‌ 19న లోక్‌సభ ఆమోదం పొందిం ది. 19 సెక్షన్‌లతో నాలుగు చాప్టర్‌లతో ఉంది. రైతు తమ ఉత్ప త్తులను ఎక్కడైనా, ఏ రూపంలోనైనా అమ్ముకోవచ్చని స్వేచ్ఛ కల్పించారు. ఈ రాష్ట్రంలోనే కాక ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునే హక్కు రైతుకు కల్పించారు. అమ్మిన డబ్బులు మూడు రోజులలో చెల్లించాలి. ఎఫ్‌పిఓల ద్వారా లేదా సొసైటీల ద్వారా ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. పాన్‌కార్డు ద్వారా పన్ను చెల్లింపు ఉంటుంది. మార్కెట్‌ ఫీజు రద్దు అవ్ఞతుం ది. వెంట వెంట ధరల సమాచారం ఇస్తారు.

తగాదా వస్తే సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ లేదా కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. రైతును మోసగించినట్టు రుజువు అయితే రూ. 25వేల నుండి ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు. కేంద్రానికి సలహాలు ఇవ్వడానికి హక్కులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టానికి రూల్స్‌ రూపొందించాలి.

ఈ చట్టం వల్ల రైతు మార్కెట్‌కు వెళ్లి అమ్ము కొనవసరం లేకుండా ఇంటివద్దనే అమ్ముకునే లేదా ఏ మార్కుట్‌ కైనా తీసుకొని వెళ్లి అమ్ముకునే స్వేచ్ఛ కల్పించినప్పటికీ రైతులు తాము ఉత్పత్తి చేసే పొలం నుండి 10 కి.మీ వెళ్లి అమ్ముకోలేరు. మద్దతు ధరల నిబంధనలు సడలించడంతో అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతో కొనుగోలుదారులు ధరలను నిర్ణయిస్తారు. ధరలలో ఎగుడు దిగుడులు బాగా ఉంటాయి.

మధ్య దళారీలు ఉండరని చెప్పినప్పటికీ రైతుల నుండి కొనుగోలు చేసేది మధ్య దళారీలే. రైతులు తాము ఉత్పత్తి చేసిన ముడిసరుకును అమ్ము తారే తప్ప ప్రాసెస్‌ చేసి, అదనపు విలువ సృష్టించి అమ్మగలిగిన స్థితిలో లేరు. ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ వీరికి లేవ్ఞ. వడ్లు, పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలు ఉన్నపళంగానే అమ్ముకుంటారు.

అందువల్ల రైతుకు అదనపు లాభం వచ్చే అవకాశం లేమీ లేదు. మార్కెట్‌ల బాధ్యత తొలగింపుతో రైతుకు ఉన్న ఆ కాస్త రక్షణ పోతుంది. రైతుకు చదువు లేకపోవడంతో అంతర్జాతీయ ధరలు, మధ్య దళారీల మోసాలు, కొనుగోలుదారుల ఎత్తుగడలు గమనిం చలేకపోతున్నారు.

ప్రస్తుతం నిర్ణయించిన మద్దతు ధరలు అమలు జరగకపోవడం వలన రైతులు దేశంలో ఏటా రూ.2.5 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు అశోక్‌గులాఠి చెప్పిన విషయాన్ని గుర్తుం చుకోవాలి. వాస్తవానికి రైతులు ఏటా రూ.5 లక్షల కోట్లకుపైగా మధ్య దళారీలకు చెల్లిస్తున్నారు.

అందువల్లనే వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలోకి టాటా, బిర్లా, అదాని, రిలయన్స్‌, ఐటిసి, బేయర్‌ లాంటి సంస్థలు వచ్చి వ్యాపారాలు సాగిస్తున్నాయి. తమ భారీ పెట్టుబడులను వ్యవసాయోత్పత్తుల కొనుగోలులోకి ఎగుమతి, దిగుమతులలోకి మళ్లించారు. ప్రస్తుతం ఉన్న ధరలు కూడా రైతులకు అందుతాయన్న గ్యారెంటీ లేదు. వాస్తవానికి పై మూడు చట్టాలు రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలోనివి. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి.

కానీ రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రం మొత్తం వ్యవసాయరంగాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసి, కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు కట్ట బెట్టడానికే ఈ చట్టాలు చేసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 26నుంచి లక్షలాది రైతులు ఢిల్లీకి చేరుకొని ఈ చట్టాలను ఉపసంహరించాలని పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

ఉద్యమాన్ని అణచడానికి రైతులపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్‌ ఉపయోగించి నిర్బంధానికి గురి చేశారు. ఏదిఏమైనా కేంద్రప్రభుత్వం రైతులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికే నిర్ణయించుకున్నట్లు కనబడుతున్నది.

రైతులు కోరుకునేది స్వేచ్ఛ కాదు. రక్షణ కావాలి. ప్రభుత్వ రక్షణ లేకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ వ్యవసాయ రంగం కొనసాగడంలేదు. అందువల్ల ప్రభుత్వ రక్షణాలు తొలగించ డమంటే కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పించి వ్యవసాయరంగాన్ని వారికి కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే.ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా చట్టాలను ఉపసంహరించుకోవడం అవసరం.

  • సారంపల్లి మల్లారెడ్డి

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/