యూనివర్సిటీ కొలువ్ఞల భర్తీ కలేనా?

ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని అవార్డులు, పేరు, ప్రఖ్యాతలు గావించినా, నియామకాల విషయంలో నిరుద్యోగుల పాలిట శాపంగానే మారిపోయిందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా యూనివర్శిటీలలో ఆచార్య కొలువ్ఞల భర్తీ, నిరుద్యోగుల పాలిట అందని ద్రాక్షలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఈ కొలువ్ఞలకు అర్హత సాధించా లంటే డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ పూర్తి చేయాలి. లేదా నెట్‌, సెట్‌, జెఆర్‌ ఎఫ్‌క్వాలిఫైడ్‌ కావాలి. దాదాపు ఈ అర్హతలు సాధించాలంటే 30 నుండి 40 సంవత్సరాల వయసు పడుతుంది. ఇలాంటి పోస్టులను గతంలో భర్తీ చేసి దశాబ్దకాలం గడిచిన తర్వాత అంతటి అదృష్టాన్ని నోచుకోలేకపోయిందని చెప్పవచ్చు.

Professer posts
Professer posts

దే శవ్యాప్తంగానున్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగానున్న ఆచార్య, సహచార్య కొలువ్ఞల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌ కోరి సంవత్సరం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి డిసెంబరు 2018 నుండి ఇప్పటి వరకు రిక్రూట్‌ మెంట్‌కు సంబంధించిన ఏ ఒక్క నోటిఫికేషన్‌ రాలేదు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ అంతటి అదృష్టాన్ని నోచుకోలేదు. ఇంకొన్ని పోస్టులకు రోస్టర్‌ వ్యవస్థను పూర్తిచేయక పోవడంతో ఆగిపోయాయి. మరికొన్ని కొలువ్ఞలు కొత్త జోన్లు, వాటి పరిధిలోని కొలువ్ఞలపై స్పష్టత రాకపోవడం వల్ల ఇబ్బంది. ఇంకా కోర్టు చిక్కులు, పరీక్ష నిర్వహణలో పలు మార్పులు తెచ్చి కేంద్రం అనుమతులకు వేచి చూడటం ఇలా ఎన్ని రకాల కారణాలున్నా కొలువ్ఞల భర్తీ అసలు జరగడం లేదని అర్థం. మండల కేంద్రం లెవెల్‌ నుంచి సెక్రటేరియట్‌ స్థాయి వరకు పలు విభాగాలలో ప్రతినెలా 500 మందికిపైగా ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గతేడాది కాలంలో దాదాపు పదివేలకుపైగా రిటైర్డ్‌ కాగా, ఆయా విభాగాలలో స్టాఫ్‌లేమితో అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురిస్తుంది. కొలువ్ఞలొస్తాయనే కోటి ఆశలతో తెలంగాణ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే ముమ్మాటికీ వారి ఆశలు నిరాశలేయ్యాయని చెప్పవచ్చు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని అవార్డులు, పేరు, ప్రఖ్యాతలు గావించినా, నియామకాల విషయంలో నిరుద్యోగుల పాలిట శాపంగానే మారిపోయిందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా యూనివర్శిటీలలో ఆచార్య కొలువ్ఞల భర్తీ, నిరుద్యోగుల పాలిట అందని ద్రాక్షలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఈ కొలువ్ఞలకు అర్హత సాధించా లంటే డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ పూర్తి చేయాలి. లేదా నెట్‌, సెట్‌, జెఆర్‌ ఎఫ్‌క్వాలిఫైడ్‌ కావాలి. దాదాపు ఈ అర్హతలు సాధించాలంటే 30 నుండి 40 సంవత్సరాల వయసు పడుతుంది. ఇలాంటి పోస్టులను గతంలో భర్తీ చేసి దశాబ్దకాలం గడిచిన తర్వాత అంతటి అదృష్టాన్ని నోచుకోలేకపోయిందని చెప్పవచ్చు. కారణాలు అనేకం. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొలువ్ఞల భర్తీ చేస్తే తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుందని భావించి, ప్రతి విద్యార్థి ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ ఆవిర్భావంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని యావత్తు ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ప్రత్యేకంగా మొత్తం 11 యూనివర్శిటీ కొలువ్ఞలను పరిశీలిస్తే 99 ప్రొఫెసర్లు, 270 అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌, 692 అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌మొత్తం 1061 ఖాళీలున్నాయని లెక్క గట్టి నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోశారు. కానీ ఆ ఆశలే వారిపాలిట అడియాశలయ్యాయి. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా యూనివర్శిటీలకు శాశ్వత వైస్‌ ఛాన్సలర్‌ లేమితో రోస్టర్‌ సిస్టమ్‌ ను త్వరగా చేయడానికి కుదరలేదు. ఆ తర్వాత కొంత కాలానికి అన్నీ యూనివర్శిటీలకు వైస్‌ ఛాన్సలర్‌లను నియమించి, యూని వర్శిటీలు సక్రమంగా నడవడానికి కృషి చేస్తూ, రోస్టర్‌ విధానం పూర్తి చేయడం, దానికి తెలంగాణ ప్రభుత్వం సైతం ఒప్పుకోవడం రేపోమాపో భర్తీ ప్రక్రియ పూర్తవ్ఞతుందన్నట్లు వచ్చిన ప్రకటనలు కాస్త ఎండమావ్ఞలా మారుతాయని ఎవరూ కూడా ఊహించలేదు. యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌ రిక్రూట్‌మెంట్‌లో ఏవో మార్పులు చేయాలనుకోవడం కొంత ఆలస్యమవ్ఞతే, కోర్టులు, కేసులంటూ మరికొంత ఆలస్యం. తీరా అన్నీ కుదిరాక నోటిఫికేషన్‌ వేయడానికి అన్నిదారులు తొలిగినవేళ గత ఏడెనిమిది మాసాల నుండి 9 యూనివర్శిటీలలో శాశ్వతవైస్‌ ఛాన్సలర్స్‌ లేక ఐఎఎస్‌ ఇంఛార్జి బాధ్యతలు అప్పగిస్తే మరో రెండు యూనివర్శిటీలలో గత ఐదు సంవత్సరాల నుండి రెగ్యులర్‌ వైస్‌ ఛాన్సలర్స్‌ లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా సెర్చ్‌ కమిటీలు ఏం చేస్తున్నాయో? రాష్ట్ర ప్రభుత్వం బిసిల నియామకం చేపడుతుందా? ఆ తర్వాత నన్నా కొలువ్ఞల భర్తీ కొనసాగించి ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు న్యాయం చేస్తుందా? లేక ఇలాగే ఏళ్లతరబడి పార్‌టైం, కాంట్రాక్టు అభ్యర్థులతో పూట గడుపుతుందా? ఎక్కడా స్పష్టత కనబడక దిక్కుతోచని స్థితిలో అత్యున్నత చదువ్ఞలు చదివిన నిరుద్యోగులున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కొన్నాళ్లు వేచిచూస్తే ఇలాంటి కొలువ్ఞలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ విరమణ వయస్సువచ్చి అవకాశాలు చేజారిపోతాయోనన్న అనుమానం కూడా రాక మానదు. అభివృద్ధి అనేది ఏదో ఒక రంగానికే పరిమితమైతే సరిపోదు. అన్నీ రంగాలలో సమభాగాలతో ఉండాలనే ప్రాథమిక విషయాన్నీ గ్రహించి ముందుకు వెళ్లినప్పుడే అందరికి మేలు జరుగుతుంది. ప్రామాణికత కలిగిన విద్య గురించి ఎందరో మహానుభావ్ఞలు ఎన్నో విధాలుగా వివరించారు. అభివృద్ధి అనే విషయంలో విద్య ప్రభావం చాలా ఉంటుంది. అది కూడా విద్యనభ్యసించిన వారికీ ఉద్యోగవకాశాలు వచ్చినప్పుడే సాధ్యప డుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం ఆంగ్లేయుల పాలనలో అష్టకష్టాలు పడుతున్న సందర్భాలలో 1911లో దాదాబాయి నౌరోజీ తమ అనుచరవర్గంతో బ్రిటిష్‌ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి, మీరు ఎన్నేళ్లయినా పాలించండి కానీ నా దేశంలో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని కోరినా ససేమిరా వారు ఒప్పుకోలేదు. 1947లో స్వాతంత్య్రం సముపార్జించిన తర్వాత 2009లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఉచిత నిర్బంధ విద్యకు చట్టాన్ని చేసి అమలుపరుస్తున్నది. అంటే దాదాపు ఇక శతాబ్దకాలం సమయం పట్టింది. నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యనందించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూ 74 శాతానికి తీసుకొచ్చారు. కానీ విద్య పూర్తి చేసిన వారికి అవకాశాలు లేకపోవడం దేనికి నిదర్శనమో ఎవ్వరికీ అర్థంకానీ పరిస్థితి. ఉద్యోగులకు పిఆర్సీలు పెంచాలన్నా, నూతనంగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్న బడ్జెట్‌ తప్పనిసరి. ప్రభుత్వాలు చెప్పే సాకు కూడా అదే. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నది. అందుకే ఆలస్యమవ్ఞతుందని, కానీ ఇక్కడ అర్థంకాని ప్రశ్నోక్కటి మిగిలి పోయింది. ఆంధ్రప్రదేశ్‌ నుండి 2014లో తెలంగాణ విడిపోయి అవి రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించినప్పుడు తెలంగాణలో మిగులు బడ్జెట్‌ ఉంటే ఆంధ్ర అప్పుల ఊబిలోనున్నది. అలాంటిది ఈ ఆరు సంవత్సరాలలో తెలంగాణాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఆంధ్రలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో, నూతన పథకాలతో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ కొలువ్ఞల విషయంలో ఎంతో మంది నిరుద్యోగుల పాలిట వరంలా నిలుస్తూ, కష్టకాలం నుండి గట్టెక్కుతూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేనందున చింతించక తప్పని పరిస్థితి. ఏదిఏమైనా రాష్ట్రంలోనున్న మేధావివర్గం, పలు సామాజిక అభివృద్ధికి పాటుపడే స్వచ్ఛంద సంస్థలు, విభిన్న సంఘాలు, ప్రభుత్వ సలహాదారులు, రచయితలు, కవ్ఞలు, కళాకారులు, పరిశీలించి ప్రభుత్వాలకు పలుసూచనలను, సమస్య పరిష్కారమార్గాలను చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉన్నత చదువ్ఞలు చదివి, ఉద్యోగాలు లేక కష్టాలుపడుతూ, కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితిలోనున్న నిరుద్యోగుల జీవితాలను అర్థం చేసుకొని, నిరుద్యోగ నిర్మూలనకు కంకణం కట్టుకోమని దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి.

  • పోలం సైదులు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/