వైద్యవిద్య సరళీకరణతో ప్రజారోగ్యానికి ముప్పు!

పాలకులు పునరాలోచన చేయలి

Medical education
Medical education

ఆస్పత్రులలో, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో సరైన మెరుగైన వసతులు కల్పించి ప్రజలకు చికిత్స అందించడం అవసరం.

గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న భారతదేశంలో ప్రభుత్వ ఆధీనంలోనే విద్యావైద్య ఆరోగ్యసేవలను అందించితేనే 130 కోట్ల మంది ప్రజలు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు.

లేనిచో ఈ వైద్యవిద్య సరళీకరణలో మార్పులు చేయకుండా వైద్యాన్ని ప్రజా పయోగ అవసరాలను తీర్చకుండా కార్పొరేటీకరణ కోసం వినియోగిస్తే ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

‘ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సక్రమమైన ఆలోచనలు వస్తాయి. సరైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటాం.

అప్పుడు ఆర్థిక పరిపుష్టి కలిగి ఆరోగ్యవంతమైన, సమాజం ఏర్పడుతుంది. ‘ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసుఉంటుంది అటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ డానికి పటిష్టమైన వైద్యరంగాన్ని తయారు చేసుకోవాలి.

అందుకని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను 1934లో ప్రారంభిం చారు. అటు తర్వాత మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956ను తీసుకువచ్చి 1964, 1993, 2001లో సవరణలు తెచ్చారు.

దీని ముఖ్య ఉద్దేశ్యం దేశమంతా ఒకే విధమైన ప్రమాణాలతో కూడిన వైద్యవిద్యను గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో అందచేసే విధంగా,నూతన మెడికల్‌ కాలేజీలో స్థాపనకు, విస్తరణకు అనుమతులు ఇవ్వడం, వైద్యవృత్తిని చేపట్టిన వారు కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పాటించే లాంటివి రెగ్యులేషన్‌ చేసే సంస్థగా పనిచేస్తోంది.

ప్రస్తుతం మనదేశంలో 542 మెడికల్‌ కాలేజీలు,64 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సంస్థలు,మెడికల్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండియాపరిధిలో పనిచేస్తున్నాయి.

కాలేజీల ఏర్పాటుకు జరిగే తనిఖీలలో అవినీతి, సీట్లు పెంచేవిషయంలో,కాలేజీలో నిబంధనల ప్రకారం వసతుల కల్పన ఏర్పాటులో మెడికల్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవకతవక లకు పాల్పడుతుందని,అవినీతి పేరుకు పోయిందని నీతి ఆయోగ్‌ తెలిపింది.

వైద్యరంగంలో సంస్కరణలను ప్రతిపాదిస్తూ 2017 డిసెంబర్‌లో జాతీయ మెడికల్‌ కమిషన్‌ బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టగా,దేశవ్యాప్తంగా ఈ బిల్లునువ్యతిరేకిస్తూ డాక్టర్ల నిరసన ప్రదర్శనలు, సమ్మెలు,ధర్నాలు జరగడంతో పార్లమెంటరీ స్టాండిగ్‌ కమిటీ ముందుపెట్టారు.

వైద్యవిద్యతోపాటు వైద్యరంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ బిల్లుపై భిన్నవైరు ధ్యాలతోకూడిన అభిప్రాయాలున్నాయి.గతంలో భారతీయ వైద్య మండలి అనుసరించిన నియమ నిబంధనలను సరళీకృతం చేయడం జరిగింది.

ఈ సరళీకరణతో ఎవరికి లాభం జరగనుందో, దేశాభివృద్ధికి ఎలా మేలుకలుగుతుందో కానీ ప్రజారోగ్యానికి ముప్పుతోపాటు మున్నా భాయ్ ఎంబిబిఎస్‌లను తయారు చేసే అవకాశం ఉందని మేధావులు, డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు భారత వైద్యమండలి లో ఛైర్మన్‌ను కేంద్రప్రభు త్వం నియమిస్తుంది. సెంట్రల్‌ కమిటీలో ఎనిమిదిమంది ప్రతి నిధులు రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులుఒక్కరూ, రాష్ట్ర వైద్య మండలి నుంచి ఒక్కోప్రతినిధి,అన్ని ఆరోగ్య విశ్వవిద్యాలయాల నుంచి ఒక్కో ప్రతినిధిసభ్యులుగా ఉన్నారు.

కొత్తగా ఏర్పాటు చేయబడే జాతీయ మెడికల్‌ కమిషన్‌లో సెంట్రల్‌ కమిటీలో 25 మంది సభ్యులు ఉంటారు.

ఛైర్మన్‌, 12మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు, ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ సెక్రటరీ ఉంటారు.ఈ కమిషన్‌లో ఐదుగురు మాత్రమే వైద్యులు కాగా మిగిలిన వారు బ్యూరోక్రాట్లులా గ్రాడ్యుయేట్స్‌,చార్టర్‌ అకౌంటెంట్‌లుంటారు.

అయితే ఈ ఏర్పాటును వైద్యవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కమిషన్‌ ఐదు రాష్ట్రాలకే ప్రాధాన్యం దక్కేలా ఉందని, కమిటీలో మెజార్టీ సభ్యులు డాక్టర్లే ఉండాలని వైద్యవర్గాలు అంటున్నాయి.

వైద్యవృత్తిలో సంబంధం లేని బయటి వాళ్లు వైద్య వృత్తిని నియంత్రించే కమిషన్‌లో సభ్యులుగా నియమించాలను కోవడం హాస్యాస్పదం.

ఇంజనీర్లను చార్టెడ్‌ అకౌంటెంట్‌లను డాక్టర్లు నియంత్రిస్తే ఎలా ఉంటుంది. రాజకీయనాయకులు బార్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉండి నడిపిస్తారా? ఆర్టీసీ డ్రైవర్‌ రైలు ఇంజన్‌ నడిపే చందంగా ఉంటుందంటున్నారు మేధావ్ఞలు.

ఎంసిఐలో అవినీతి కారణంగా 69 కళాశాలలో అవకతవకలు జరిగాయి.ఈ కొత్త బిల్లు అవినీతిని ఎలా నిరోధిస్తుంది?నేషనల్‌ కమిషన్‌ బిల్లు అమలైతే వైద్యరంగంతో సంబంధం లేనివారికి వైద్యులు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది.

హోమియో, ఆయుర్వేద కోర్సులు చేసిన వారికి బ్రిడ్జ్‌ కోర్స్‌అందించి ఆధునిక వైద్యంప్రాక్టీస్‌ చేపట్టేందుకు అనుమతించడం అభ్యంతరకరం.

పూర్తిస్థాయిలో కోర్సు చదివి ఒక సంవత్సరం పాటు ఆస్పత్రిలో పనిచేసిన ఎంబి బిఎస్‌ డాక్టర్లే చికిత్స చేయడంలో తడబడుతు న్నారు.

బ్రిడ్జికోర్సుచది విన వారికి అనుమతించడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమే అని వైద్యనిపుణులు వాపో తున్నారు.

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలపై ఉన్న ఆంక్షలు, నియం త్రణలు ఎత్తివేసి,ఎక్కువసంఖ్యలో ఎంబిబి ఎస్‌, పిజి సీట్లను అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావించడం ప్రైవేటీ కరణ, సరళీకరణ,గ్లోబలీకరణలో భాగంగానే వైద్యవిద్య వ్యాపా రానికి శ్రీకారంచుట్టింది.

గతంలో మెడిసిన్‌,పిజి సీట్లు పెంచాలంటే ఎంసిఐ పరిశీలించి తగిన సౌకర్యాలు ఉన్నాయని, బోధనా సిబ్బంది ఉన్నారని గర్తిస్తేనే అనుమతి ఇచ్చేది.

ప్రస్తుతం ప్రవేశ పెట్టిన కొత్తప్రతిపాదనలో గతంలో ఉన్న నిఘావ్యవస్థ ఉండదు.

మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలే కావాల్సినసంఖ్యలో ఎంబిబి ఎస్‌, పిజిసీట్లు పెంచుకోవచ్చని, 40శాతం సీట్లపై ప్రభుత్వం, 60శాతం సీట్లపై పైవేట్‌ యాజమాన్యం ఫీజు నిర్ణయిస్తుందనే ప్రతిపాదనను కేబినెట్‌ 50 శాతానికి పెంచింది.

కానీ ప్రస్తుత విధానంలో ఫీజు నియంత్రణ ప్రభుత్వంచేతిలో 80శాతం. ప్రైవేట్‌ కాలేజీల చేతుల్లో 15 శాతం ఉంటే, ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం 50శాతం చేశారు.

ఇది పేదలకి,ప్రజలకి ఎలా లాభమో? పాలక పెద్దలే వివరించాలి.

ఇది గ్రామీణ ప్రాంతాల బడుగుబల హీన వర్గాలకు చెందిన విద్యార్థులు డాక్టర్లు కావడం అనేదికల గానే మిగిలిపోతుంది.

కోట్ల రూపాయలున్న వారికే తెల్లకోటు వేసుకునే అవకాశం కల్పించేందుకే ఫీజు నియంత్రణ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకుందని భావించవచ్చు.ప్

రైవేటీకరణ కాలంగా అధిక ఫీజులు నిర్ణయించి పేద విద్యార్థులు ఈ కోర్సులవైపు రాకుండా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ లోపాయికారిగా ఈ విద్యకు దూరం చేయాలనే కుట్రలు జరుగుతుండడం ఇబ్బంది కరం.

అంతేకాకుండా విదేశాల్లో వైద్యవిద్య చదివిన భారతీయవిద్యా ర్థులకు మనదేశంలో వైద్య వృత్తిలో ప్రవేశించాలంటే జాతీయ స్థాయిలో నేషనల్‌ లైసెన్సయిట్‌ ఎగ్జామ్‌ రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉండేది.

కొత్త విధానం ప్రకారం ఈపరీక్ష రాయనవసరం లేకుండానే విదేశాలలో చదివిన విద్యార్థులు ఇండియాలో వైద్యవృత్తి చేపట్టే వెసులుబాటు కల్పించడం జరిగింది.

ఇలా అనుమతించడం మూలం గా రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మనదేశంలో చదివిన డాక్టర్లు ఇతర దేశాల్లో ప్రాక్టీస్‌ చేయాలంటే ఆయా దేశాలు నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందే.

మనదేశంలో సరైనవసతులు కల్పించి వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చే దిపోయి వేలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా విదేశీ విద్యను ప్రోత్సహించే విధంగాచర్యలుండటం ఆశ్చర్యకరంగా ఉంది.

మరొక ముఖ్యమైన అభ్యంతరకర విషయం ఏమిటంటే నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లులోని సెక్షన్‌ 32 దీనిప్రకారం కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్‌ను పరిమిత స్థాయిలో వైద్యవృత్తిని ప్రాక్టీస్‌ చేసేందుకు అనుమతించే విషయం ప్రాథమిక వైద్య స్థాయిలో కొన్నిరకాల మందులు, ప్రిస్క్రైబ్‌ చేసే విధంగా పరిమితులతో కూడిన అనుమతిస్తారు.

వీళ్లు ఇదివరకే పని చేస్తున్న ఆర్‌ఎంపి, పిఎంపిలకు ఏమాత్రం తీసిపోరు. వారిలాగే కొన్నిరోజుల శిక్షణతో డాక్టర్లుగా పనిచేయడానికి అనుమ తిస్తే ప్రజల జీవితాలతోఆడుకోవడమే అవుతుంది. ఆరోగ్యరంగంలో సహకారం ఇవ్వడంవేరు, వైద్యవృత్తిని ప్రాక్టీస్‌ చేయడం వేరుగా ఉంటుంది.

ఈ అవకతవకలతో కూడిన సరళీకృత విధానాల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్‌ వెహికల్‌ కళాశాల అన్నింటిలో ఒకే రకమైన ప్రమాణాలు ఏర్పడేఅవకాశం ఉండదు.

డాక్టర్లు, ప్రజలు ప్రభుత్వం కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా కేంద్రీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వమే ఏకపక్ష నిర్ణయం తో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తీసుకురావడం జరిగింది.

అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ఆరోగ్యరంగం అత్యంత నిరాదరణకు గురైందన్నది నగ్నసత్యం. ప్రపంచంలో అనేక దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతంమేర నిధుల్ని ఆరోగ్యరంగానికి కేటాయించడం జరుగుతుంది.

ఆ ప్రకారం ఆరోగ్యంపై భారత్‌లో ప్రజలు చేస్తున్న ఖర్చు వారి ఆదాయంలో 65 శాతం ఉంటుంది.

అందువల్ల యూరప్‌, థాయిలాండ్‌, క్యూబా వంటి మెరుగైన వైద్యఆరోగ్య సేవల అనుభవాలను చూసి మన వైద్యాన్ని మెరుగుపరుచుకు నేందుకు మనదేశ స్థూలదేశీయోత్పత్తిలో ఆరోగ్యరంగం వాటాను 1.4శాతం నుండి2.5 శాతం పెంచాలి.

జాతీయ ఆరోగ్య విధానం సూచించిన మేరకురాష్ట్రాలు తమబడ్జెట్లో ఎనిమిది శాతం నిధులు కేటాయించి ఆరోగ్యరంగాన్ని అభివృద్ధి పరిచి ప్రభుత్వ ఆస్పత్రులలో, ప్రభుత్వమెడికల్‌ కాలేజీలలో సరైనమెరుగైన వసతులు కల్పించి ప్రజలకు చికిత్సఅందించడం అవసరం.

గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న భారతదేశంలో ప్రభుత్వ ఆధీనంలోనే విద్యావైద్య ఆరోగ్యసేవలను అందించితేనే 130 కోట్లమంది ప్రజలు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు.

లేనిచో ఈ వైద్య విద్య సరళీకరణలో మార్పులు చేయకుండా వైద్యాన్ని ప్రజాపయోగ అవసరాలను తీర్చకుండా కార్పొరేటీకరణ కోసం వినియోగిస్తే ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

-తండా సదానందం

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/