సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి..

ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కొన్నిరోజుల కిందట బళ్లారి నగరంలో బళ్లారి ఉత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. ఈ వేడుకల్లో గాయని మంగ్లీ సైతం హాజరై, తన పాటలతో అలరించింది.

ఈ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా బళ్లారిలో ఆ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బళ్లారి ఉత్సవ్ సందర్భంగా… మంగ్లీ మేకప్ టెంట్ లో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు కొందరు యువకులు రాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే మనసులో పెట్టుకొని మంగ్లీ కారుపై దాడి చేసారని అంత అనుకుంటున్నారు.