KGF కలెక్షన్లను బ్రేక్ చేసిన కాంతారా

కాంతారా మూవీ KGF కలెక్షన్లను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. రిషబ్ శెట్టి, సప్తమీ గౌతమీ జంటగా నటించిన కాంతారా మూవీ 50 రోజుల తర్వాత కూడా పలు రికార్డ్స్ తిరగరాస్తునే ఉంది. సెప్టెంబర్ 30 న రిలీజ్ అయినా ఈ మూవీ మొదటి రోజు నుండి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. 2022లో రిలీజైన చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా కంతార రికార్డును క్రియేట్ చేసింది. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 450 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొంది. తాజాగా కన్నడ లో కెజిఫ్ రికార్డ్స్ ను కాంతారా బ్రేక్ చేసింది.

కేజీఎఫ్2 చిత్రం పూర్తికాలం థియేటర్ రన్‌లో 161.5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రిలీజైన కంతార చిత్రం 172 కోట్ల రూపాయలు రాబట్టింది. కేజీఎఫ్ 2 చిత్రం 75 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. కంతార 100 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ రెండు చిత్రాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మించడం విశేషం.