ఇరాన్‌లో ఒకే రోజు 12 మంది ఖైదీల‌కు ఉరి

బలూచి: ఇరాన్‌లో 12 మంది ఖైదీల‌ను ఒకే రోజు ఉరితీశారు. ఇందులో 11 మంది పురుషులు, ఓ మ‌హిళ ఉన్నారు. డ్ర‌గ్స్‌, మ‌ర్డ‌ర్ కేసులో వీళ్లంతా దోషులుగా ఉన్నారు. 12 మందిలో ఆరుగురిపై డ్ర‌గ్ ఆరోప‌ణ‌లు ఉండ‌గా, మ‌రో ఆరుగురిపై మ‌ర్డ‌ర్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సిస్తాన్‌-బ‌లుచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న జ‌హెదాన్ జైలులో సోమ‌వారం ఉద‌యం వీళ్ల‌ను ఉరి తీశారు. ఈ ప్రాంతం ఆఫ్ఘ‌నిస్తాన్‌, పాకిస్థాన్ బోర్డ‌ర్ స‌మీపంలో ఉంది. 12 మందిని ఉరి తీసిన విష‌యాన్ని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమ‌న్ రైట్స్ తెలిపింది. కానీ ఇరాన్‌కు చెందిన స్థానిక మీడియా ఈ మ‌ర‌ణ‌శిక్ష‌పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే ఇరాన్‌లో మైనార్టీ తెగ‌ల‌కు చెందిన‌వారిని టార్గెట్ చేస్తున్న‌ట్లు ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కాగా, 2021లో ఇరాన్‌లో 333 మంది ఉరి తీశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/