పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది

తెనాలి రోడ్డు షో లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫై రాయి విసరగా..అది ఆయనకు తగలకుండా పక్కన పడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయిలో ఉంది. ఎన్నికల పోలింగ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడం తో అన్ని పార్టీల అధినేతలు తమ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ విజయవాడ లో మేమంతా బస్సు యాత్ర చేస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కన్ను కనుబొమ్మకు తగలడం తో కుట్లు పడ్డాయి.

ఈరోజు రెస్ట్ తీసుకుంటున్న జగన్..రేపటి నుండి తిరిగి తన యాత్రను పున ప్రారభించబోతున్నారు. ప్రస్తుత ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా..ఈరోజు పవన్ కళ్యాణ్ ఫై రాయితో దాడి చేసే ప్రయత్నం చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని గుంటూరు జిల్లా తెనాలిలో ‘వారాహి యాత్ర’ చేపట్టారు. యాత్ర సాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా కొద్ది దూరంలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పవన్ భద్రతా సిబ్బంది, జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.