నేడు కూడా భారీ లాభాలలో మార్కెట్లు

ముంబయి ; దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటిలాగే నేడు కూడా భారీ లాభాలను దండుకున్నాయి. సెన్సెక్స్ 54 వేల మార్కు, నిఫ్టీ 16 వేల మార్కు దాటడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడి ఉదయం నుంచీ మార్కెట్లలో కొనుగోళ్ల కళ కనపడింది.దీంతో, చివరికి సెన్సెక్స్ 546.41 పాయింట్ల లాభంతో 54,369.77 వద్ద ముగియగా.. నిఫ్టీ 128.05 పాయింట్ల లాభంతో 16,258.80 వద్ద క్లోజయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.13 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/