క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్
మహిళల 53 కేజీల విభాగంలో స్వీడన్ రెజ్లర్‌పై భారీ విజయం
vinesh-phogat-enter-into-quarters
టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అదరగొట్టింది. మహిళల 53 కేజీల విభాగం ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్ రెజ్లర్ మ్యాట్సన్ సోఫియాను 7-1 తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఫొగాట్ చివరి వరకు అదే ఊపు కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్లో ఫొగాట్ బెలారస్ రెజ్లర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా, కాంస్య పతకం కోసం జర్మనీతో జరుగుతున్న పోరులో భారత జట్టు నాలుగో క్వార్టర్లో 5-4తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాల పాటు భారత జట్టు డిఫెన్స్ చేయగలిగితే భారత్‌కు కాంస్య పతకం ఖాయమైనట్టే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/