స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి…
లైఫ్ టైమ్ గరిష్టంగా నిఫ్టీ 15,469
Mumbai: దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డు స్థాయికి చేరాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. నిఫ్టీ ఒక దశలో 15,469 వద్ద లైఫ్ టైమ్ గరిష్టాన్ని తాకింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద ముగిసింది. వరుసగా ఆరో రోజు మార్కెట్ విస్తరించింది. బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 3 నెలల విరామం తర్వాత ఈ రోజు తాజా రికార్డును తాకింది.
తాజా కెరీర్ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/