రామజన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం

అయోధ్యలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పూజలు

Chief Minister Yogi Adityanath

Ayodhya: చైత్ర నవరాత్రి​ పర్వదినాన్ని  పురస్కరించుకుని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక ఘట్టానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంకురార్పణ చేసింది.

బుధవారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీరాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగంణంలోకి తరలించారు.

దిత్యనాథ్‌ స్వయంగా తన చేతుల మీదుగా రామ జన్మభూమి ప్రాంగణంలోని మాసస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/