మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎవరు ఆపదలో ఉన్న తన వంతు సాయం చేయడంలో చిరంజీవి ముందుంటారని సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆర్ధిక సాయం చేసిన చిరంజీవి తాజాగా సీనియర్ సినిమాటోగ్రఫర్ పి.దేవరాజ్ కు ఐదు లక్షల ఆర్ధిక సాయం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.

“రీసెంటుగా సుమన్ టీవీలో సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ఇంటర్వ్యూ వచ్చింది. తెలుగు .. తమిళ … మలయాళ .. బెంగాలీ భాషల్లో ఆయన 300 సినిమాలకి పైగా పనిచేశారు. అలాంటి ఆయనకి ఆ మధ్య మేజర్ యాక్సిడెంట్ జరిగిందట. అప్పటి నుంచి ఆయన సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు.

తనకి రోజు గడవడమే కష్టంగా ఉందనీ .. మందులకు కూడా డబ్బులు లేవని ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన దేవరాజ్ ను కలిసి ఆర్ధిక సాయంగా 5 లక్షల రూపాయల ‘చెక్’ను అందజేశారు. గతంలో చిరంజీవీ నటించిన ‘టింగు రంగడు’ .. ‘రాణికాసుల రంగమ్మ’ .. ‘నాగు’ .. ‘పులి బెబ్బులి’ సినిమాలకి ఆయన పనిచేశారు. చిరంజీవి చేసిన ఆర్ధిక సాయం పట్ల దేవరాజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.