తెలుగు యూనివర్సిటీలో బతుకమ్మ సంబురాలో గవర్నర్-కవిత

వ‌ర్సిటీ ఉద్యోగులు, విద్యార్థినుల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ

హైదరాబాద్ : గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ఎమ్మెల్సీ కవిత నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ కిషన్‌ రావు, ఉద్యోగులు, విద్యార్థులు వారికి సాదర స్వాగతం పలికారు. వర్సిటీ ఆవరణలో విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి గవర్నర్‌ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు.

అనంతరం కవిత మాట్లాడుతూ.. ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసైతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పాత పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేయాల‌ని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో కాలంతో పాటు ప్ర‌జ‌లు మ‌ర్చిపోయిన‌ తెలుగు పదాలు, తెలంగాణ పదాలు మళ్లీ భాషలో చేరే అవకాశం ఉంటుంద‌ని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/