కాంగ్రెస్ జోడో యాత్రలో తోపులాట..మాజీ మంత్రికి గాయాలు

stampede-in-rahul-gandhi-bharat-jodo-yatra

హైదరాబాద్ః కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లో కొనసాగుతోంది. పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు ప్రజలు ఆయన వెన్నంటి నడుస్తున్నారు. దారిలో తారసపడే జనంతో మాట్లాడుతూ, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు నడుస్తున్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు, ఆయనతో సెల్ఫీ కోసం యువతీయువకులు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇక బుధవారం కూకట్ పల్లిలో రాహుల్ ను కలిసేందుకు జనం పోటెత్తడంతో తోపులాటకు దారితీసింది. వెనకనుంచి జనం దూసుకుని రావడంతో మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ కు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కంటికి అయిన గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగా, జోడో యాత్రలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు కిందపడిపోవడంతో రాహుల్ చేయందించారు. పైకిలేపి నీళ్లు తాగించి సపర్యలు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/