నేడు బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ

న్యూఢిల్లీ: బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోడీ నేడు సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటలకు కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, గ్రామీణం, మేడ్చల్‌ అర్బన్‌, గ్రామీణం, సికింద్రాబాద్‌, సెంట్రల్‌ జిల్లా అధ్యక్షులతో ప్రధాని భేటీ కానున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను గెలిచే విధంగా కార్పొరేటర్లకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయటంపైనా సూచనలు చేయనున్నారు. ప్రధానితోభేటీ కోసం కార్పొరేటర్లు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉదయం 8 గంటలకు దిల్లీ వెళ్లనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/