సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు: ప్రధాని

YouTube video
PM attends inaugural function of ‘Invest Karnataka 2022’ via video conferencing

న్యూఢిల్లీః ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ..సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. . గ్లోబల్ క్రైసెస్ సమయంలో కూడా ఆర్థిక వేత్తలు, నిపుణులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తున్నారన్నారు. పెట్టుబడి దారులను రెడ్ టాపిజం నుంచి విముక్తి చేశామని చెప్పారు. అలాగే వారికి రెడ్ కార్పెట్ అవకాశాలు కల్పించామన్నారు. గతంలో మూసివేయబడిన ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహించామన్నారు. స్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించామన్నారు.

కరోనా తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రధాని మోడీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక అంశాలపై పనిచేస్తున్నామని తెలిపారు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, నిపుణులు భారతదేశాన్ని మాత్రం ఆర్థిక సంక్షోభం నుంచి శరవేగంగా బయటపడుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. వివిధ దేశాలతో కేంద్రం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. మరోవైపు ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్ జరగనుంది. నవంబర్ 4వరకు బెంగళూలరులో కార్యక్రమం జరగనుంది. పెట్టుబడిదారులను ఆక్షర్షించడంతో పాటు, అభివృద్ధి చేపట్టే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/