వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి

వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో అపశృతి చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి – శృతి హాసన్ జంటగా మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. కేవలం రెండు వారాల్లోనే రూ. 200 కోట్లు క్రాస్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా భారీ విజయం సాధించడం తో మైత్రి మూవీ మేకర్స్ చిత్ర సక్సెస్ మీట్ ను ఈరోజు శనివారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అట్టహాసంగా నిర్వహించారు.

ఈ వేడుకలకి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు.. యూనివర్సిటీ గేటు బయట వెయిట్ చేశారు. అయితే.. భద్రతా సిబ్బంది గేట్ ఓపెన్ చేయడంతో.. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొంత మంది అభిమానులకి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పటల్ కు తరలించినట్లు సమాచారం. ఇక ఆచార్య , గాడ్ ఫాదర్ చిత్రాలతో నిరాశ పరిచిన చిరంజీవి..వాల్తేర్ వీరయ్య తో అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ ను ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషి చేసాడు. దేవి శ్రీ మ్యూజిక్ అందించగా..బాబీ డైరెక్ట్ చేసాడు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ‘బాస్ పార్టీ’ అనే ఐటెం సాంగ్‌లో చిరు పక్కన చిందులేసింది.