న్యూ ఇయర్ కానుకగా నాని ‘అంటే సుందరానికి’ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న హీరో నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మూవీ చేస్తున్నాడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి…’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. నాని కెరియర్‌లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుండటం విశేషం. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి జీరో లుక్‌ ను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం.

జనవరి 1 వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు ఈ జీరో లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. మరి ఆ లుక్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ‘అంటే సుందరానికీ’ అంటూ వదిలిన ఈ టైటిల్ కాన్సెప్ట్ బేస్డ్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. ఆ వీడియో లో నాని పంచెకట్టు, షర్టుతో ఉండగా.. చేతిలో లగేజ్‌ బ్యాగ్‌, కోటు అంతా చిత్ర విచిత్రంగానే ఉంది. అలాగే సైకిల్‌, షూస్‌, వీణ, కెమెరా, పచ్చళ్ల డబ్బాలు, రాశుల చక్రం, ఫ్లైట్‌ ఇవన్నీ ఆసక్తిరేకెత్తించే విధంగా ఉంది. మొత్తానికి ఇది రొటీన్ సినిమా కాదని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అర్థం అయ్యేట్టు చేశారు దర్శకుడు.