SSMB28 రిలీజ్ డేట్ ఖరారు

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న SSMB28 మూవీ తాలూకా రిలీజ్ డేట్ ను అధికారిక ప్రకటన చేసారు. గతంలో వీరిద్దరి కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించగా..ఇప్పుడు మరోసారి వీరి కాంబో లో సినిమా అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13 న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ సినిమాలో మ‌హేష్‌బాబుకు జోడీగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఇక ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పాటు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ – సముద్ర ఖని కలయికలో తెరకెక్కుతున్న మూవీ కి స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు.