రామ్ చరణ్ ఫై ప్రశంసలు కురిపించిన హైపర్ ఆది…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు రేపు (మార్చి 27). ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో మెగా బర్త్ డే సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఆదివారం మెగా అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలవ్వగా..ఈ వేడుకల్లో పాలుపంచుకున్న స్టార్ కమెడియన్ హైపర్ ఆది..తనదైన స్టయిల్ లో మెగా స్పీచ్ ఇచ్చి మరోసారి మెగా అభిమానులను ఆకట్టుకున్నాడు. “రామ్ చరణ్.. తండ్రి పేరు నిలబెడతాడా? బాబాయ్ పేరు కాపాడతాడా? అని అంతా అనుకుంటూ ఉంటే, తాను కేవలం కుటుంబానికి మాత్రమే కాదు .. దేశం మొత్తానికి పేరు తీసుకుని వచ్చినవాడాయన. తెలుగు సినిమాకి ఆంధ్రాలో ఎంత వచ్చింది .. తెలంగాణలో ఎంత వచ్చింది అని మాట్లాడుకునే స్థాయిని, అమెరికాలో ఎంత వసూలు చేసిందని మాట్లాడుకునేలా చేసినవాడు మెగా పవర్ స్టార్” అంటూ చెప్పుకొచ్చాడు. ఒక మనిషిని చూడగానే పదిమంది దణ్ణం పెడితే అది మెగాస్టార్.

ఒక మనిషి పదుమందికి అన్నం పెడితే అది పవర్ స్టార్. చరణ్ కి తన తండ్రిలా సాయం చేయడం తెలుసు. తన బాబాయ్ లా అన్నం పెట్టడం తెలుసు” అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక పవన్ కల్యాణ్ గారి విషయానికి వస్తే, ఆయన సాగించిన పోరాటాలెన్నో .. ఆయన సాధించిన విజయాలెన్నో. ఆయన జనాభా లెక్కల్లో ఒకడు కాదు .. లెక్క లేనంత జనాభాకి ఒకే ఒక్కడు. సమస్య తలుపు తడితే పరిష్కారాన్ని ఇంట్లో ఉంచే నాయకుడు ఆయన” అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

YouTube video