రాహుల్ కోసం ఎంపీ పదవులను వాడుకోవడానికి సిద్ధం – కోమటిరెడ్డి

రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ ఎంపీలమంతా తమ పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరశిస్తూ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీ కాంగ్రెస్ నేతలంతా నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..రాహుల్‌కు మద్దతుగా అవసరమైతే తమ ఎంపీ పదవులను వదులుకుంటామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు పదవులు వదులుకోవడానికి సిద్దంగా ఉన్నారని, సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆదేశిస్తే రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, రాహుల్ గాంధీ రెండుసార్లు ప్రధాని అయ్యే ఛాన్స్ వదులుకున్నారని వెంకటరెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని వెంకటరెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించిన పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, రాహుల్ గాంధీని బహిష్కరించిన పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని విమర్శించారు.