పెను ప్రమాదం నుండి బయటపడ్డ రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. రాజమౌళి తెరకెక్కించిన RRR ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాదు ఇతర దేశాల్లో కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమాను జపాన్‌ లో విడుదల చేయగా సక్సెస్‌ఫుల్‌ గా ఏడాదిన్నర గా థియేటర్లలో రన్‌ అవుతుంది.

ఈ క్రమంలోనే అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ షోలో పాల్గొనేందుకు రాజమౌళి జపాన్ వెళ్లారు. అక్కడ రాజమౌళి పెను ప్రమాదం(Accident) నుంచి తప్పించుకున్నారు. అక్కడ భూకంపం(Earthquake) బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తీకేయ తెలిపారు. తాము ఓ బిల్డింగ్‌ లో 28 వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విటర్‌ లో పేర్కొన్నారు.

జపాన్‌ లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేం ఇప్పుడే చూశాం అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మేం టెన్షన్‌ పడ్డాం కానీ, జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. వారంతా ఏదో వానజల్లు పడుతున్నంత తెలికగా తీసుకున్నారు… మేము మాత్రం మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేశామంటూ కార్తికేయ ట్విటర్‌(X) లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీ పనుల్లో బిజీ గా ఉన్నారు.