శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధింపు

ప్రధాని నివాసాన్ని ముట్టడించిన వేలాది మంది నిరసనకారులు

Sri Lanka declares state of emergency after president flees

కోలంబోః శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. దేశంలో అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. ఆందోళకారుల దెబ్బకు ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈరోజు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. అంతేకాదు శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. అయినా ఆందోళన కారులు తగ్గడం లేదు. మరోవైపు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/