పార్టీ నేతలతో సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో ఆరు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు కెసిఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంతోపాటు పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేస్తారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, కేంద్రం తీరు, రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. సరైన అవగాహన, చైతన్యం లేక అనేకమంది గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవడంలేదు. వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా టీఆర్‌ఎస్ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనూ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తేవాలని సిఎం సూచించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/