వివాదంలో చిక్కుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..

,

టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ పాల్గొన్నారు. కాగా ర్యాలీలో జనం మధ్య ఆయన తుపాకీతో కాల్పులు జరపడం ఇప్పుడు వివాదంలోకి నెట్టాయి. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడం.. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై సర్వత్రా చర్చ గా మారడంతో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన తెలిపారు. నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌ను. క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా..అని తెలిపారు.