లారీ డ్రైవర్ కర్కశత్వం : చక్రాల కింద పడి మహిళ మృతి

గుంటూరు శివారులో ఘోరం

woman died in lorry accident
woman died in lorry accident

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా శివారు నాయుడుపేట సమీపంలో చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో ఒక మహిళ చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చిఅదే లారీ కింద ప‌డి మృతి చెందింది. లారీ దిగిన సమయంలో డ్రైవ‌ర్‌తో వాగ్వాదంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు సమాచారం.

గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి డ్రైవ‌ర్‌కు రూ 100 ఆ మ‌హిళ ఇచ్చింద‌ని, కానీ, డ్రైవ‌ర్ రూ 300 డిమాండ్ చేసిన‌ట్టు తెలిసింది. అంత డ‌బ్బు లేద‌ని చెప్ప‌డంతో డ్రైవర్ లారీని ఆప‌కుండా ముందుకు క‌దిలించాడు. ఈ క్ర‌మంలో ఆమె పిల్ల‌లు ఆ లారీలో ఉండ‌డంతో వారికోసం లారీని ప‌ట్టుకుని వేలాడుతూ కొంత‌దూరం వెళ్లిన ఆ మ‌హిళ అదుపుత‌ప్పి అదే లారీ చ‌క్రాల కింద ప‌డిపోయింది. మృతురాలు ర‌మ‌ణ (40)గా గుర్తించారు. పోలీసులు లారీ డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నారు. త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద పిల్లలు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/